free html hit counter
టాక్ “అంతర్జాతీయ మహిళా దినోత్సవ” పోస్టర్ ఆవిష్కరించిన కవిత

మహిళాభ్యున్నతితో దేశాభివృద్ధి సాధ్యం:కల్వకుంట్ల కవిత

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల మార్చ్ 11 న లండన్ లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ సంస్థ (టాక్ ) నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్‌ను సోమవారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆవిష్కరించారు. అనంతరం సంస్థ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది కవిత ను శాలువా తో సన్మానించారు.

“తెలంగాణ చరిత్ర – మహిళలు” అనే ఆలోచన తో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని, మన తెలంగాణ చరిత్ర లో ఎంతో మంది వీర వనితలున్నారని, సమైక్య రాష్ట్రం లో వారికి తగిన గుర్తింపు గౌరవం దక్కలేదని, టాక్ సంస్థ వీలైనంత వరకు, వాటి పరిరక్షణకు కృషి చేస్తుందని, మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణకు చెందిన వివిధ రంగాలలో మహిళల జీవిత విశేషాలతో కూడిన ఫోటో ఎక్సిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు అధ్యక్షురాలు పవిత్ర కంది తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ మహిళా దినోత్సవం జరుపడం ఏంతో సంతోషంగా వుందని , ముఖ్యంగా “తెలంగాణ చరిత్ర – మహిళలు” అనే గొప్ప ఆలోచన తో వెళ్లడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ సంస్థ (టాక్ ) సభ్యులని అభినందించారు.

టాక్ సంస్థకు తన సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ వుంటాయని చెప్పారు .
మరియు మహి ళలు అన్ని రంగాల్లోనూ రాణించాలనీ ,మహిళాభ్యున్నతితో దేశాభివృద్ధి సాధ్యమని, మహిళలు అన్నిరంగాల్లోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని, సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు కల్పించినప్పుడే నిజమైన సమాజ అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు.

టాక్ సంస్థ ఒక మహిళా నాయకురాలి అధ్యక్షతన ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని ప్రశంశించారు.

“తెలంగాణ చరిత్ర – మహిళలు” అనే ఆలోచనను ప్రోత్సహించి అభినందించిన కవిత గారికి, అలాగే సమాచార సేకరణలో సహాయం చేస్తున్నటువంటి కవి నందిని సిద్ద రెడ్డి గారికి, సంపాదకులు కట్ట శేఖర్ గారికి టాక్ మహిళా సభ్యురాలు స్వాతి బుడగం కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది తో పాటు మహిళా ప్రతినిధులు స్వాతి బుడగం, సుమా విక్రమ్, విజయ లక్ష్మి, శ్రీ శ్రావ్య, అపర్ణ మరియు ఇతర ప్రవాస మిత్రులు నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

TAL Ugadi Celebrations 2017

Telugu Association of London (TAL) is celebrating Ugadi Celebrations on 08th April 2017 at Redbridge Town Hall, High Road, Ilford IG1 1DD. This event includes a number of special Telugu cultural acts and with a renowned presence and performances by both local and international artists.

Come and celebrate Telugu Ugadi with cultural performances and delicious food with Ugadi pachadi.

  • Early bird Ticket  – £15  until 25th March 2017
  • Adult Ticket – £20
  • Child Ticket – £10 (5-15 yrs)
  • Under 5 yrs  Free Entry

​​

For TAL Member Tickets:

contact  contact@taluk.org  or call  Sridhar Medichetty (07958 480166)​​​​​​​

ఎన్నారై టి.ఆర్.యస్ యుకె కార్యవర్గ సమావేశం

తెరాస ఎంపీ కవిత అధ్యక్షతన లండన్ లో ఎన్నారై టి.ఆర్.యస్ యుకె కార్యవర్గ సమావేశం

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ యుకె కార్యవర్గ సమావేశం లండన్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి.కల్వకుంట్ల కవిత గారి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా,నూతన కార్యవర్గ సభ్యులని ఎంపీ కవిత గారికి పరిచయం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రవాస తెరాస కార్యకర్తల బాధ్యత, పార్టీ నిర్మాణానికి కృషి, తెలంగాణ రాష్ట్రం లో తెరాస ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే వినూత్న విధానాలు, యుకె లో వివిధ వేదికల్లో తెలంగాణ ను మరియు తెలంగాణ నాయకత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు మరియు భవిషత్తు కార్యక్రమాల పై దిశా నిర్దేశం తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది.
ఎన్నారై టి ఆర్ ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ముందుగా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలని, భవిష్యత్తు ప్రణాలికను కవిత గారికి వివరించడం జరిగింది.
ఈ సందర్బంగా కవిత గారు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా పటిష్ట నాయకత్వంతోనే సాధ్యమవుతుందని ,తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర సమితి కట్టుబడి వుందని, కెసిఆర్ గారి తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ప్రవాస తెరాస కార్యకర్తలుగా ప్రపంచ వేదికల్లో మన తెలంగాణ ఖ్యాతిని, నాయకుడు కెసిఆర్ గారి గొప్పతన్నాని తెలియజెప్పాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటునందుకు, ఇక్కడి పద్దతులపై అధ్యయనం చేసి ఇటు ప్రభుత్వానికి సూచనలు -సలహాలు అందించేలా కృషి చెయ్యాలని తెలిపారు.
అలాగే పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఎన్నారై టి.ఆర్.యస్ యుకె సభ్యుల పట్ల ప్రత్యేక గౌరవం ఉందని, ఉద్యమం నుండి నేటి వరకు పార్టీ వెంటే ఉండి, ఎంతో బాధ్యతగా సేవ చేస్తున్నారని, తప్పకుండ పార్టీ అన్ని సందర్భాల్లో మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రవాస తెరాస శ్రేణులకు శిక్షణా తరగతులను నిర్వహించి ప్రభుత్వ పథకాల పై అవగాహనా కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.
చర్చ లో కార్యవర్గ సభ్యుల సందేహాలకు సమాధానం ఇస్తూ, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా
ముందుకు వెళ్లాలని అందరిలో స్ఫూర్తిని నింపింది.

కవిత గారి ప్రోత్సాహం, దిశా నిర్దేశం నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని కార్యవర్గ సభ్యులు తెలిపారు.
అధికారిక పర్యటనలో భాగంగా లండన్ వచ్చినప్పటికీ, ప్రత్యేక సమయాన్ని కేటాయించి కార్యవర్గ సమావేశం లో పాల్గొని సభ్యులందిరిలో స్ఫూర్తినింపినందుకు కవిత గారికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, ,శ్రీకాంత్ పెద్దిరాజు , ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ కుమార్ వీర ,సెక్రటరీ లు సృజన్ రెడ్డి ,శ్రీధర్ రావు తక్కళ్లపల్లి , సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , కోశాధికారి మధుసూదన్ రెడ్డి ,లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్ ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి ,ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల ,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం , మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని,హాజరైన వారిలో వున్నారు .