free html hit counter
TARA – International Women’s Day Celebrations 2018

Let’s celebrate the elegance of womenhood.. Come join us and cherish the moments

TARA welcomes all the women to join the celebrations.

Lunch included in the registration price.

Mark the date 4th MArch , 2018 to attend TARA Women’s Day Celebrations. Inviting all the ladies, come along with your friends and join us. Make new friends, enjoy the quiz, taste the food, dance till you are exhausted and cherish the moments together. Register now, price includes lunch served at the venue:

http://www.tarauk.org/events/womens-day-2018/

 

యునైటెడ్ కింగ్డం (UK)లో ‘తారా’ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దీపావళి సంబరాలు!

యునైటెడ్ కింగ్డం (UK)లో ‘తారా’ వారి ఆధ్వర్యంలో రీడింగ్ నగరంలో తెలుగు ప్రవాసాంధ్రులు దీపావళి సంబరాలు కన్నుల పండుగగా జరుపుకున్నారు.

మొదట తారా ప్రెసిడెంట్  లక్ష్మి మాటూరు గారు జ్యోతి  ప్రజ్వలన చేసి దీపావళి కార్యక్రమాలని మొదలుపెట్టారు. చిన్నారులు, ‘మన మాట’ కోర్స్ ద్వారా తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు దేవతల వేషధారణలు, భక్తి పాటలు, నృత్యాలు చూపరులని ఆకట్టుకున్నాయి.

గాయకులు శాలిని గారు, రాంప్రసాద్ గారు, హరీష్ గారు, కళ్యాణి గేదెల గారు, రెక్స్ గారు ప్రదర్శించిన సంగీత విభావరితో అటు మధురమైన పాత పాటలతో, ఇటు హుశారెక్కించె  పాటలతో ప్రేక్షకులను అలరించారు. అనన్య చట్టర్జీ శిష్యులు, సౌమ్య రావు మరియు కృష్ణ ప్రియ నృత్య ప్రదర్శన ఒక ఆకర్షణగా నిలచింది.

మంజునాథ్ డ్రమ్స్ తో , సోలమన్ వాయించిన కీబోర్డ్ తో  వేడుక ప్రాంగణాన్ని హోరెత్తించారు. డాండియా సాంగ్స్ కి అనుగుణంగా నృత్యాలు ఆడుతూ అందరూ ఎంజాయ్ చేసారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కళ్యాణి గారికి, తమ కళని, విలువైన సమయాన్ని ఈ కార్యక్రమానికోసం కేటాయించిన కళాకారులను ‘తారా’ తరఫున ప్రెసిడెంట్ లక్ష్మిమాటురు మరియు సెక్రటరీ రవికాంత్ వాకాడ ధన్యవాదాలు తెలిపారు. అలాగే వాలంటీర్స్ కి, స్పాన్సర్స్ కి, సభ్యలకి    తారా కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు. అన్నీ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని, భోజనం, స్నాక్స్ తో రోజంతా తోటి తెలుగు వారితో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసామని ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు.

మన సంస్కృతిని, తెలుగు భాషను కాపాడుకునే విధంగా పిల్లలకు ‘మన మాట’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, దీని ద్వారా 25మంది చిన్నారులు తెలుగుని నేర్చుకుంటున్నారని, వారికి తెలుగు మీద ఆసక్తి పెరగడాన్ని చూసామని, ఈ కోర్స్ని తల్లితండ్రుల వినతి మేరకు లాంగ్లే లో కూడా ప్రారంభించామని చెప్పారు. ఒక సంవత్సరం విజయవంతంగా నడిపి, రెండో సంవత్సరంలో అడుగుపెట్టామని, మన తెలుగు భాషని కాపాడుకోవాల్సిన భాద్యత మనందరిదని ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తున్న సూర్య ప్రకాష్ భల్లముడి, రవికాంత్ వివరించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడ్తున్న ‘తారా’కి సభ్యులు కితాబు పలికారు.

ఈ కార్యక్రమ ఫోటోలు: https://www.facebook.com/media/set/?set=a.456378177898085.1073741852.100005777202866&type=1&l=5332881a04

మరిన్ని వివరాలకు, విచ్చేయండి www.tarauk.org, లేదా  https://www.facebook.com/telugu.sanghamu.reading లేదా రాయండి  contactus@tarauk.org ఇమెయిల్ కి.